# Best time and Bad time in career #astrology #teluguastrology #careerastrology #vedicastrology #nadi

**Channel:** Madhukar Astrology & Spiritual Talks
**Source:** https://www.youtube.com/watch?v=Vqz11_EERAY
**Transcript page:** https://www.withtranscript.ai/video/Vqz11_EERAY

## Chapters

- 0:03 — నాడీ జ్యోతిష్యం పరిచయం మరియు వృత్తి కారకుడు
- 1:53 — శని గురు కలయిక మరియు కుజుడి దృష్టి
- 5:13 — నీచ శని జాతక విశ్లేషణ
- 9:11 — గురు గోచారంతో ప్రమోషన్ టైమింగ్
- 10:55 — చంద్ర కేతువులపై శని గోచార ఫలితాలు

## Transcript

**[0:03]:** అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో నాడీ జ్యోతిష్యాని ఉపయోగించి ఉద్యోగంలో కష్ట నష్టాలు ఎప్పుడు వస్తాయి? ఉద్యోగంలో ప్రమోషన్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? అసలు ఉద్యోగంలో జీతం ఏ టైంలో పెరిగే అవకాశం ఉంటుంది? ఉద్యోగం ఏ టైంలో పోయే అవకాశాలు ఉంటాయి? ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంటుంది? ఇలాంటివన్నీ కూడా మనం సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం నాడీ జ్యోతిష్యాన్ని యూస్ చేసుకుని మాత్రమే చెప్తున్న విధానము. నాడీ జ్యోతిష్యం అనేది వన్ ఆఫ్ ద స్కూల్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ అన్నమాట. అంటే ఆస్ట్రాలజీలో మల్టిపుల్ స్కూల్స్ ఉన్నాయి. పరాశర పద్ధతి అని, జైమిని ఆస్ట్రాలజీ అని, కేపీ ఆస్ట్రాలజీ అని, నాడీ ఆస్ట్రాలజీ అని, తాజిక్ ఆస్ట్రాలజీ అని ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. అందులో నాడీ ఆస్ట్రాలజీ కూడా చాలా ముఖ్యమైనది అండ్ దాని ద్వారానే ఈరోజు ఈ ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ నాడీ జ్యోతిష్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా గ్రహ కారకత్వాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట. అంటే లగ్నము, మొదటి స్థానం, రెండవ స్థానం వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా గ్రహ కారకత్వాల మీదే మొత్తం ప్రిడిక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. చాలా ఆక్యురేట్గా ఉండే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయండి. సో ఇప్పుడు మనం ఉద్యోగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఉద్యోగానికి సంబంధించిన కారకుడు శని భగవానుడు.

**[1:19]:** సో మీ జాతకంలో శని భగవానుడు ఎక్కడున్నారు అన్న దాన్ని బట్టి మొత్తం మీ ప్రమోషన్స్ ఏంటి? మీ ట్రాన్స్ఫర్స్ ఏంటి? మీ లైఫ్లో ఎటువంటి పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి కెరీర్లో ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ చార్ట్స్ యూస్ చేసుకుని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతిదీ కూడా గ్రహ కారకత్వం మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ప్రెసెంట్ ఇప్పుడు కెరీర్ గురించి చూస్తున్నాం కాబట్టి కెరీర్కి సంబంధించిన కారకుడు శని భగవానుడు. సో శని భగవానుడు మీ జాతక చక్రంలో ఎలా ఉన్నారో మొదట చూసుకోవాలి అన్నమాట.

**[1:53]:** ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 1995లో శని ఇక్కడ ఉన్నప్పుడు పుట్టారనుకోండి. సో ఈ లైఫ్ ఈ పర్సన్ యొక్క జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే 96లో కి వస్తారు, 97లో కి వస్తారు. ఈ లైఫ్ అనేది ఇలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అన్నమాట ముందుకి. సో ఇలా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ శని భగవానుడు కూడా ఈ యొక్క కుంభ రాశి నుంచి మీన రాశికి, ఈ మీన రాశి నుంచి మేష రాశికి, మేష రాశి నుంచి వృషభ రాశికి ఇలా ప్రయాణం చేస్తూ ఉంటారు. సో ఇది ఒక జాతకుడి యొక్క హారోస్కోప్ అయితే ఆ జాతకంలో శని భగవానుడు ఇక్కడ కుంభ రాశిలో ఉన్నట్టయితే సో ఈ శని భగవానుడిని చూసుకుని మనం ఇతని కెరియర్ అనేది జడ్జ్ చేయాలి. ఉదాహరణకి ఎప్పుడైనా సరే నాడీ జ్యోతిష్యంలో ఒక గ్రహానికి వెనక రాశిలో ఏ గ్రహం ఉంది, అలాగే ఒక గ్రహానికి ముందు రాశిలో ఏ గ్రహం ఉన్నది అన్నది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఈ గ్రహానికి సపోర్ట్ చేయాలి అంటే ఈ గ్రహం వెనకాల రాశిలో ఈ గ్రహానికి సంబంధించిన మిత్ర గ్రహం గాని లేదా పవర్ఫుల్ ప్లానెట్ అనేది ఉండాలి. అలాగే ఈ గ్రహానికి నెక్స్ట్ రాశిలో కూడా ఒక పాజిటివ్ ప్లానెట్ గనక ఉంటే ఈ గ్రహానికి కోఆపరేషన్ అనేది కచ్చితంగా ఈ ప్లానెట్ ఇస్తుంది అన్నమాట.

**[3:04]:** సో ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఈ పర్టికులర్ జాతకుడికి రెండవ స్థానంలో శని నుంచి రెండవ స్థానంలో గురు గ్రహం ఉన్నారనుకుందాం. సో 95లో పుట్టిన అతను తన లైఫ్ ముందుకు వెళ్లే కొద్దీ శని కూడా ముందుకు వెళ్తారు కదా. సో శని ముందుకు వెళుతూ ఏ గ్రహాన్ని టచ్ చేస్తున్నారో, ఏ ఏ గ్రహాలను టచ్ చేస్తూ వెళుతున్నారో దాని బట్టి ఇతని ఎంటైర్ కెరియర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు శని వృత్తి కారకుడు కాబట్టి కేవలం ఈ శని నుంచి రెండవ స్థానంలో గురు ఉన్నారు. అంటే శని వెళ్లి ఫస్ట్ గురు గ్రహాన్ని టచ్ చేస్తారన్నమాట. సో గురు గ్రహము, శని గ్రహము కూడా ముఖ్యంగా నాడీ జ్యోతిష్యంలో చూసుకుంటే ఈ రెండు కూడా ఫ్రెండ్లీ ప్లానెట్స్. అంటే కొంతమంది జనరల్ గా వేదిక్ ఆస్ట్రాలజీలో ఏం చెప్తారు ఈ రెండు సమ గ్రహాలు అని చెప్తూ ఉంటారు. కానీ నాడీ జ్యోతిష్యం పరంగా ఈ రెండిటికి కూడా చాలా మితృత్వం ఉన్నదని భావించాలి. సో ఎప్పుడైతే శని వెనక్కాలే రెండవ స్థానంలో గురు గ్రహం ఉన్నారో ఈ పర్టికులర్ వ్యక్తి కచ్చితంగా లైఫ్ లో మంచి పొజిషన్ లో ఉంటారు. మంచి నేమ్ సంపాదించుకుంటారు. మంచి జీతం అనేది ఎర్న్ చేస్తారు. సో ముఖ్యంగా ఎప్పుడైనా ఈ గురు గ్రహము మీన రాశిలో ఉన్నారు అనుకోండి శని తర్వాతే వాళ్ళు గవర్నమెంట్ వృత్తిలో ఉండడం లేదా కొన్ని కొన్నిసార్లు డాక్టర్ వృత్తుల్లో ఉండడం, లా వృత్తిలో ఉండడం ఇలాంటివి కూడా సహజంగా జరుగుతాయి అన్నమాట.

**[4:22]:** సో శని ఏ ఏ గ్రహాలను టచ్ చేస్తూ వెళ్తున్నారో దాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి మీ ఈ పర్టికులర్ జతకంలో శని కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఇక్కడ కుజుడు ఉన్నారు అనుకోండి సో దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలంటే శని మీద ఇక్కడ కుజుడు దృష్టి పడుతోంది కాబట్టి శని వృత్తి కారకుడు కాబట్టి ఈ పర్టికులర్ జాతకుడికి లైఫ్ లో ఎంత మంచి పొజిషన్ వచ్చినా ఈ గురు గ్రహాన్ని టచ్ చేయడం వల్ల ఈ కుజుడు కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక రకమైన సవాళ్లు అనేవి ఈ వ్యక్తికి ఉండే అవకాశాలు ఉంటాయి. కుజుడు అంటే ఏంటి ఇక్కడ ముఖ్యంగా గొడవలకు సంబంధించిన గ్రహము అగ్రెసివ్ ప్లానెట్ అన్నమాట. సో ఎప్పుడైతే వృత్తి కారకుడిని కుజుడు చూస్తున్నారో ఉద్యోగంలో గొడవలు ఎదురవ్వడం, ఉద్యోగంలో ఎక్కువ కాంపిటీషన్ ఎదురవ్వడం, అలాగే ఉద్యోగంలో ఎనిమీస్ అనే వాళ్ళు ఉండడం ఇలాంటివి కూడా కచ్చితంగా ఉంటాయి అన్నమాట.

**[5:13]:** ఇప్పుడు ఇది ఒక పర్సన్ జన్మ జాతకం అనుకుందాము. ఉదాహరణకి శని ఇక్కడ ఉన్నారు అన్నమాట. అంటే మేష రాశిలో శని ఉన్నారు. సో శని మేష రాశిలో ఉన్నారు అంటే ఆ అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ 93 లో పుట్టారు అనుకుందాము. ఈ 93 సమయానికి ఉదాహరణకి చెప్తున్నాను శని ఈ యొక్క మేష రాశిలో ఉన్నారు అని అనుకుందాం. సో ఇలా అనుకున్నప్పుడు శని కి వచ్చే నెక్స్ట్ రాశిలోనే కేతువు ఉన్నారు అనుకోండి అండ్ శని కి ఇవతల రాశిలోనే కుజుడు ఉన్నారు అనుకోండి అండ్ శని కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో శుక్రుడు ఉన్నారు అనుకోండి సో ఈ జాతకాన్ని మనం ఎలా చెప్పాలి ఎలా చెప్పొచ్చు కెరీర్ పరంగా. సో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే శని నీచబడి ఉన్నారు. సో మేష రాశిలో శని నీచబడి ఉంటారు కాబట్టి ఈ పర్టికులర్ వ్యక్తి కెరీర్ లో చాలా కష్టాలు పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ కష్టంతోనే ఆగిపోదు తన మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడు కేవలం ఇలా ఉన్నప్పుడు అంటే శని ఈ మేష రాశిలో నీచ పడినప్పుడు మాత్రమే దీన్ని చెప్పొచ్చు సహజంగా. సో శని కి వచ్చే రాశిలో ఎవరున్నారు? కేతువు ఉన్నారు. అంటే 93 తర్వాత ఇది ఉదాహరణ జాతకమే.

**[6:18]:** సో 93 తర్వాత 94 వస్తుంది. అంటే లైఫ్ అనేది ఎవ్వరికి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో శని కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు. సో శని వెళ్లి ఇక్కడ కేతువు ఏంటి? కేతువు వక్రించిన గ్రహం. సో కేతువు ఇలా వెనక్కి వస్తూ ఉంటారు. శని ముందుకు వెళుతూ ఉంటారు. సో శని వెళ్లి కేతువును టచ్ చేస్తున్నారు. ఇక్కడ కేతువు అంటే ఏంటి ఒక రకంగా డిస్ సాటిస్ఫాక్షన్ సూచిస్తూ ఉంటుంది. లేకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో చాలా కష్టాలు అనేవి సూచిస్తూ ఉంటుంది కేతు గ్రహం. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే నిరాశను కూడా సూచిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే శని వెనక్కాలే కేతువు ఉన్నారో ఈ రెండు కాంబినేషన్స్ ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈ పర్టికులర్ జాతకుడికి ఉద్యోగం చేయాలనిపించకపోవడం లేదా కొన్ని కొన్ని సార్లు ఉద్యోగంలో నిరాశ కలగడం, అసలు ఉద్యోగానికే ఈ వ్యక్తి అట్రాక్ట్ అవ్వకపోవడం, ఎక్కువ కష్టాలు ఈ పర్సన్ ఉద్యోగరీత్యా ఫేస్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ రెండిటి బట్టి కూడా మనం అది అర్థం చేసుకోవచ్చు. సో కేతువు అంటే ఏంటి? కేతువు మోక్షానికి సంబంధించిన గ్రహం. అంటే కేతువుకి ఒకటి కావాలి, ఒకటి వద్దు అని ఏదీ ఉండదు. న్యూట్రల్ ప్లానెట్. శని అంటే ఏంటి? కష్టపడాలి, కష్టపడితేనే ఏదైనా అని చెప్పేసి శని హార్డ్ వర్క్ ని సూచిస్తూ ఉంటారు.

**[7:26]:** వృత్తి కారకుడు కాబట్టి ఈ వృత్తి కారకుడు వెళ్లి కేతువును టచ్ చేస్తున్నప్పుడు కచ్చితంగా వృత్తిలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాలి. కేతువు అంటేనే పతాకము అని అర్థం. సో పతాకము అంటే ఏంటి? జెండా. జెండా ఎప్పుడూ కూడా గాలిలో ఎగురుతూ ఉంటుంది. సో జనరల్ గా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ విపరీతమైన హార్డ్ వర్క్ చేయాలి. అంటే ఒక 300% కష్టపడితే వీళ్ళకి ఒక 70% ఫలితం ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళు ఎంతో కష్టపడాలి అని చెప్పి సూచిస్తూ ఉంటుంది. సో ఇక్కడికి ఈ రెండు కాంబినేషన్ల గురించి తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఈ శని వెనక్కాలే కుజుడు ఉన్నారు. సో ఇక్కడ ఈ శని మీద కేతువు ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అండ్ కుజుడు ఇన్ఫ్లుయెన్స్ కూడా పడుతుంది. సో కుజుడు అంటేనే ఇందాక మనం చెప్పుకున్నట్టు గొడవలకు కారకుడు అండ్ ఆల్సో అగ్రెషన్ కి సంబంధించిన గ్రహం. సో కెరీర్ లోనే వాళ్ళకి ఈ పర్సన్ కి ఎనిమీస్ ఉండడం, సో ఈ పర్సన్ ని చూసి ఎక్కువ మంది ఏడవడం, జలసీ ఫీల్ అవ్వడం ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో ఈ ఈ ఈ కాంబినేషన్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ పర్సన్ చాలా కష్టపడతాడు కెరీర్ లో అని అర్థం చేసుకోవాలి.

**[8:34]:** అంత ఈజీగా ఉండదు. ఎక్కువ కష్టాలు పడుతూ తను కెరీర్ ఎప్పుడైనా సరే వదిలేయాలి అన్న ధోరణిలో ఉంటాడు అన్నమాట. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ గా శని కి ఆపోజిట్ లో శుక్రుడు ఉన్నారు. సో శుక్రుడు అంటే ఏంటి సంపద కి సంబంధించిన గ్రహము. సో శుక్రుడు శని ఇలా ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేసుకుంటున్నారో లేదా కలిసి ఉన్నారో వాళ్ళు కెరీర్ లోనే చాలా మంచి స్థాయిలో ఉంటారు. అదొక ఫస్ట్ పాయింట్ అయితే వాళ్ళు కెరీర్ లో ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ కేవలం శని శుక్రులు కలిసి ఉండడం, ఆస్పెక్ట్ చేయడం వల్ల ఇదంతా ఆధారపడి ఉండదు. మిగతా గ్రహాల బట్టి కూడా మనం కంక్లూజన్ కి రావాల్సి ఉంటుంది.

**[9:11]:** ఇప్పుడు కెరీర్ లో అసలు ఏ టైం బాగుంటుంది అన్నది ఎలా తెలుసుకోవాలి? ఉదాహరణకి శని ఇక్కడ ఉన్నారు అనుకోండి మనం కేవలం నాడీ ज्योतिष్యం పరంగా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కేవలం ఏంటంటే శని ని బట్టే మనం అంతా కూడా చూడాలి. శని ఇక్కడ ఉన్నారు జన్మ జాతకంలో. సో ఎప్పుడైనా సరే గురు గ్రహం యొక్క సంచారం ఈ శని కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో అంటే ఈ కుంభ రాశిలో జరుగుతోంది అనుకోండి ఈ అంటే ఈ జన్మ జాతకంలో శని ఇక్కడ ఉన్నారు సింహ రాశిలో. గోచార రీత్యా గురు గ్రహము ఈ కుంభ రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ జన్మ జాతకంలో ఉన్న శని ని యాక్టివేట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో వీళ్ళు ఆ పర్టికులర్ టైం లో ప్రమోషన్ రావడం గాని లేకపోతే ఆ పర్టికులర్ టైం లో వాళ్ళకి మంచి నేమ్ గాని, ఫేమ్ గాని రావడం గాని, అలాగే జీతం పెరగడం గాని ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మెయిన్ సో ఇది చాలా వండర్ఫుల్ థింగ్ అండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ జన్మ జాతకంలో శని ఈ సింహ రాశిలో ఉన్నారు. సో ఎప్పుడైతే గురు ఇలా గోచార రీత్యా ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఈ శనికి ముందు రాశిలోకి వచ్చిన లేదా ఈ శని మీదకు వచ్చిన లేదా శని తర్వాత వచ్చిన సో ఈ పర్టికులర్ పాయింట్ లో ఖచ్చితంగా వీళ్ళకి కెరియర్ లో మంచి పొజిషన్ లో ఉంటారు అండ్ కెరియర్ పరంగా సం

**[10:26]:** హోదా రావడం గాని పొజిషన్ రావడం గాని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే జన్మ జాతకంలో శనిని గురు గ్రహం ట్రిగ్గర్ చేయాలి. అది ఆస్పెక్ట్ వల్ల అవ్వచ్చు లేకపోతే కంజంక్షన్ వల్ల అవ్వచ్చు లేదా నాడి ఆస్ట్రాలజీ రూల్స్ ఏంటి శనికి ముందు అండ్ శని కి వెనకాల సో ఇది శని కి ముందు శని కి వెనకాల ఈ పాజిటివ్ ప్లానెట్ వచ్చింది అంటే ఈ వృత్తిని ట్రిగ్గర్ చేస్తుంది అన్నమాట. సో అప్పుడు కెరియర్ అనేది ఆ టైంలో చాలా బాగుండే అవకాశాలు ఉంటాయి.

**[10:55]:** ఇప్పుడు ఈ జన్మ జాతకాన్ని చూసుకుందాము. ఈ జన్మ జాతకంలో ఇది మేష రాశి అన్నమాట. ఈ మేష రాశిలో చంద్ర కేతువులు ఉన్నారు. చంద్రుడు అంటే ద ప్లానెట్ ఆఫ్ మూమెంట్ అంటే కదలికని సూచించే గ్రహము చంద్రుడు. ఒక రకంగా కేతువు కూడా ఈ కదలికల్ని సూచిస్తూ ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మ జాతకంలో ఉదాహరణకి ఆ శని ఇక్కడ ఉన్నారు అనుకుందాం. సో శని ఇక్కడ ఉన్నారు జన్మ జాతకంలో కానీ ఈ జన్మ జాతకానికి గోచార రీత్యా శని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ కూడా మీరు చూస్తే శని సంచారం మీన రాశిలోనే జరుగుతుందన్నమాట. సో శని ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఈ యొక్క చంద్రున్ని కేతువుని ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే శని ఇలా మూవ్ అయ్యి ఈ మేష రాశిలోకి వచ్చారు అనుకోండి అంటే ఈ జన్మ జాతకంలో ఉన్న చంద్ర కేతువుల మీదకి ఈ గోచారంలో శని వచ్చారు అంటే చంద్రుడు అనేది ప్లానెట్ ఆఫ్ మూమెంట్ కాబట్టి వీళ్ళు ఉద్యోగాలు మారే అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు అంటేనే దూర ప్రయాణాలను కూడా సూచిస్తూ ఉంటారన్నమాట. సో దూర ప్రయాణాలకి వెళ్లడం లేకపోతే అప్పటివరకు ఉన్న ప్రాజెక్ట్ కోల్పోయి వేరే ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టడం కొన్ని కొన్ని సార్లు కేతువు కూడా ఉన్నారు కాబట్టి ఉద్యోగం నుంచి బయటికి వచ్చేయడం ఉద్యోగం కోల్పోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది.

**[12:15]:** సో చంద్రకేతువులు జన్మజాతకంలో ఎక్కడైతేนన్నారో అక్కడ శని ట్రిగర్ చేస్తున్న జనరల్ గా ఏంటంటే చంద్ర కేతువులను పక్కన పెట్టినా కూడా చంద్రుడు ఎక్కడైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏలిననాటి శని కదా సో ఏలిననాటి శని టైంలో చూడండి చాలామంది ఉద్యోగ రీత్యా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారన్నమాట. సో చంద్రుడు ప్లానెట్ ఆఫ్ మూమెంట్ కాబట్టి కెరియర్ పరంగా మూమెంట్ అనేది సం ట్రబుల్స్ అనేది మానసికంగా అశాంతి అనేది సూచిస్తూ ఉంటుంది. ఇక్కడనే కాదు ఉదాహరణకి మీకు ఈ యొక్క చంద్రుడు మేషరాశిలోనే ఉండి శని సంచారం అనేది ఈ తులా రాశిలో జరుగుతుందనుకోండి అంటే జన్మజాతకంలో చంద్రుడు ఇక్కడ ఉన్నారు గోచారంలో శని ఇక్కడ ఉన్నారు అంటే మీ జన్మజాతకంలో ఉన్న చంద్రున్ని ఈ శని ట్రిగర్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో కూడా కెరియర్ మారడం లేకపోతే వేరే జాబ్ ప్రయత్నం చేయడం ఉన్న ఉద్యోగం నుంచి వేరే దానికి వెళ్లడం ఉన్న ప్రదేశం నుంచి వేరే దానికి వెళ్లడం జరుగుతూ ఉంటాయి. సో దీన్ని స్థాన చలనము అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఉన్న ప్లేస్ నుంచి మారి వేరే ప్లేస్ కి వెళ్తారు అని అర్థం అన్నమాట. ఇవన్నీ చెప్తున్నప్పుడు మీరు ఒకటి అనుకోవచ్చు గోచారానికి సంబంధించిన విషయాలు చెప్తున్నారు అని. సో గోచారము అనేది వేరు ఈ నాడీ జ్యోతిష్యాన్ని వేరే కాన్సెప్ట్ లో మనం చూడాలన్నమాట.

**[13:28]:** సో గోచారం అంటే ఏంటి మీ జన్మ రాశి నుంచి ఈ గ్రహాలు ఎలా సంచారం చేస్తున్నాయి దాన్ని బట్టి చెప్పేది గోచారం కానీ ఈ నాడీ జ్యోతిష్యం పరంగా ఏంటి మీ జన్మ జాతకంలో గ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రహాల నుంచి మిగతా జనరల్ గా గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ట్రాన్సిట్ చేస్తున్నాయి అన్న దాన్ని బట్టి ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి చాలామందికి ఇవి చాలా రకాల రిజल्टస్ డిఫరెంట్ రిజल्टస్ ఇచ్చే కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి శని ఇక్కడ కర్కాటక రాశిలో ఉన్నారు అనుకుందాము జన్మజాతకంలో అండ్ ఈ గోచార రీత్యా కూడా శని ఈ యొక్క మకర రాశికి వచ్చారనుకోండి అంటే తన జన్మజాతకంలో ఉన్న ప్లేస్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఈ గోచార శని ఎప్పుడైతే వచ్చారో వీళ్ళకి కెరియర్ లో రైస్ అనేది సో ఈ పర్టికులర్ టైంలో కెరియర్ అనేది చాలా బాగుండే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇబ్బంది పెట్టే గ్రహాలు చూస్తున్నాయి అనుకోండి ఈ పర్టికులర్ శనిని ఈ శని గోచారంలో ఎప్పుడైతే వచ్చారో ఈ ఈ యొక్క ఇబ్బంది కూడా అంటే కుజుడు ద్వారా కలిగే ఇబ్బందికి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఈ శని గోచారంలో శని వచ్చినప్పుడు దీనికి

**[14:38]:** ఇస్తూ ఉంటారన్నమాట. సో అది ఒకటి పాయింట్ మీరు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఉదాహరణకి ఇదంతా ఈ పర్టికులర్ పాయింట్ మీరు పక్కన పెట్టండి. శని గోచారంలో గనਕ ఇక్కడ మకరంలో ఉన్నారు అనుకుందాం. సో నెక్స్ట్ ఇమీడియట్ గా మీ జన్మ జాతకంలో కుజుడు ఇక్కడ ఉన్నారనుకోండి సో మీ జన్మ జాతకంలో కుజుడు ఇక్కడ ఉన్నారు. సో గోచారంలో శని ఈ మకర రాశిలోకి వచ్చారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శని కుజులు ఇద్దరూ కూడా అంత మితృత్వం ఉన్న గ్రహాలు కాదు కాబట్టి ఎప్పుడైతే శని ఇలా కుజుడు వైపుకు ప్రయాణం చేస్తున్నారో అంటే మీ జన్మ జాతకంలో ఉన్న కుజుడు మీదకి శని ఎప్పుడైతే వెళుతున్నారో ఈ పర్టికులర్ టైంలో కచ్చితంగా కెరియర్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. కుజుడు అంటేనే ప్రాబ్లమాటిక్ ప్లానెట్. కెరియర్ కి సంబంధించిన గ్రహం ఇలా ఈ ఈ ఈ యొక్క కుజుడు మీదకు వెళుతున్నారు అంటే కెరియర్లో ప్రాబ్లమ్స్ రావడం, కెరియర్లో చాలా ఇబ్బందులు పడడం లాంటివి కచ్చితంగా జరుగుతాయి. ఉదాహరణకి సేమ్ ఇదే ఇక్కడ కుజుడు బదులు సూర్యుడిని తీసుకుందాం అండ్ గోచార రీత్యా శని ఇక్కడ సూర్యుడు అంటే కుంభ రాశిలో సూర్యుడు ఉన్నారు అనుకుంటే ఈ యొక్క జన్మ జాతకంలో ఈ ఎగ్జాక్ట్ జన్మ జాతకంలో ఉన్న సూర్యుడు మీదకి ఈ గోచార శని వచ్చినా లేదా ఎగ్జాక్ట్ జన్మ జాతకంలో ఉన్న

**[15:52]:** సూర్యుడికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఈ గోచారంలో శని వచ్చినా హైయర్ అథారిటీస్ వల్ల కష్టాలు పడడం సో ఆఫీస్ లో ఈ ఈగో ఇష్యూస్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉండడం ఆ ఈగో ఇష్యూస్ వల్ల కొలీగ్స్ కి సంబంధించిన ఈగో వల్ల ఈ కెరియర్లో ప్రాబ్లమ్స్ అనేవి రావడం ఇలాంటివన్నీ ముఖ్యంగా బాస్ లు ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. అంటే హైయర్ అథారిటీస్ చేతిలో ప్రెజర్ ఎక్కువ పడిపోయి మన మైండ్ అనేది సతమతం అయిపోతూ ఉంటుంది ఈ టైం పీరియడ్ వచ్చినప్పుడు. సో ఒకటండి మెయిన్ థింగ్ ఏంటంటే మీ మీ జన్మజాతకంలో శని ఎక్కడైతే ఉన్నారో అక్కడికి గోచారంలో శని కి ఇబ్బంది పెట్టే గ్రహాలు వస్తుంటే ఈ ప్రొఫెషన్ అనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో శని ఎక్కడైతే ఉన్నారో అక్కడికి శుభ గ్రహాలు ఇప్పుడు గురువు గాని, శుక్రుడు గాని వీళ్ళు వస్తున్నారు అంటే కచ్చితంగా ప్రొఫెషన్ అనేది చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అలాగే శని కూడా ఫర్ ఎగ్జాంపుల్ గురు గ్రహం మీ జన్మజాతకంలో గురువు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు ఏ లేకపోతే ఈ పర్టికులర్ పాజిటివ్ ప్లానెట్స్ ఉన్న ప్రదేశంలోకి శని గోచారంలో వచ్చి కనెక్ట్ అవుతున్న లేదా గోచారంలో చూస్తున్న కచ్చితంగా ఏమవుతుందంటే కెరియర్ అనేది చాలా బాగుండే అవకాశం ఉంటుంది. కానీ గురువు అంటే జీవకారకుడు కదా గురువు అంటే మనము మన హెల్త్ మన మన యొక్క శరీరం ఇవన్నీ.

**[17:10]:** సో ఈ గురువు మీదకి శని వచ్చినప్పుడు కెరియర్ బాగుంటుంది కచ్చితంగా కానీ గురువు అనేది హెల్త్ కాబట్టి మన శరీరం కాబట్టి హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం అన్ని రకాలుగా చూసి ప్రెడిక్షన్ అనేది చేయాలి. సో ఇది నాడీ జ్యోతిష్య లో ఒక ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఇది అందరికీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కచ్చితంగా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నేను కచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇటువంటి కాన్సెప్ట్స్ సింపుల్ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే మీకు కెరియర్ లో ఏ సమయంలో ప్రాబ్లం ఉంటుంది, ఏ సమయంలో పాజిటివ్ గా ఉంటుంది అన్నది కచ్చితంగా తెలుసుకోవచ్చు అన్నమాట. థాంక్యూ సో మచ్.
